Warning: Undefined array key "Simple_Social_Icons_Widget" in /home/u322738031/domains/syllabus.sarkariresultpro.in/public_html/wp-content/themes/studio-pro/includes/helpers.php on line 380
TSPSC Group 2 Telugu Syllabus 2023 pdf download exam Pattern, @ Tspsc.gov.in - syllabus by sarakri result pro in

TSPSC Group 2 Telugu Syllabus 2023, Telangana Public Service Commission (TSPSC) has released the Syllabus for Group 2 Telugu Post. Interested candidates can check exam pattern download syllabus pdf at Tspsc.gov.in. Meanwhile, Know the TSPSC Group 2 Telugu syllabus exam pattern, selection process below. In order to start preparation, candidates have to know the TSPSC Group 2 Telugu exam pattern and syllabus and the exam date 2023.

It’s easy to check TSPSC Group 2 Telugu syllabus on sarkari result portal, rather than finding the syllabus pdf file on Telangana Public Service Commission portal, you can subject wise marks for Group 2 Telugu exam from official source of TSPSC.

TSPSC Group 2 Telugu Syllabus 2023 – exam Pattern, @ Tspsc.gov.in

Exam Name Group 2 Telugu
Organization Telangana Public Service Commission
Vacancy 583
Exam Date (tentative) Expected this month
Education type 10th 12th pass govt jobs  /
Selection Process: Exam / interview
Notification year 2023
Official website Tspsc.gov.in
category #syllabus
Organization page TSPSC notifications 2023

TSPSC Group 2 Telugu Syllabus 2023

Candidates who are applied for TSPSC Group 2 Telugu, have to know the exam pattern and marking scheme as well syllabus. For most exam notifications like upcoming job syllabus, Telangana Public Service Commission

Release syllabus with advertisement notification. But most of the readers prefer web based syllabus for TSPSC upcoming job syllabus and pdf for detailed topics.  For that reason sarkari result provides TSPSC upcoming syllabus topic wise as well as pdf format. Kindly follow the below steps to download the syllabus and view the topics TSPSC upcoming job syllabus.

 

tspsc group 2 syllabus in telugu pdf

 

TSPSC Group 2 Telugu syllabus topics

Just like every government competitive examinations TSPSC Group 2 Telugu syllabus also contains, General knowledge, arithmetic ability, general awareness and English. The TSPSC jobs exam duration, negative marks, questions wise weightage available in the pdf format. Also check the TSPSC upcoming syllabus exam pattern above.

 

TSPSC Group 2 Telugu Syllabus 2023 Important links

Event Links
Notification TSPSC Group 2 notification 2023
Admit card TSPSC Group 2 hall ticket 2023
Parent # TSPSC syllabus
English TSPSC Group 2 syllabus in english pdf
Location type ts government jobs 2023
Also follow central government jobs 2023
Download Syllabus PDF #here

How to do download TSPSC Group 2 Telugu Syllabus 2022?

  1. Visit the official website of TSPSC Group 2 Telugu link below, navigate to syllabus section download TSPSC Group 2 Telugu Syllabus,
  2. Finally, view The TSPSC Group 2 Telugu syllabus and verify the details.
  3. You can also view /download the TSPSC Group 2 Telugu syllabus from our website too.

Disclaimer: This only for Indicative purpose only, for official TSPSC Group 2 Telugu Syllabus downloads PDF from official website.

గ్రూప్- 2: పేపర్ -1

 

జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్

  • కరెంట్ అఫైర్స్: ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు.
  • అంతర్జాతీయ సంబంధాలు, ముఖ్య పరిణామాలు.
  • జనరల్ సైన్స్; శాస్త్రసాంకేతిక రంగాల్లో భారత విజయాలు.
  • పర్యావరణ అంశాలు; విపత్తు నిర్వహణ- నివారణ, ఉపశమన వ్యూహాలు.
  • ప్రపంచ భూగోళ శాస్త్రం, భారత భూగోళశాస్త్రం, తెలంగాణ రాష్ట్ర భూగోళ శాస్త్రం.
  • భారత్- చరిత్ర, సాంస్కృతిక వారసత్వం.
  • తెలంగాణ – సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం.
  • తెలంగాణ రాష్ట్ర విధానాలు.
  • అణగారిన వర్గాల హక్కుల అంశాలు, వారి అభివృద్ధికి సంబంధించిన చర్యలు.
  • లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్.
  • బేసిక్ ఇంగ్లిష్ (పదో తరగతి స్థాయి).
  • గ్రూప్-2 పేపర్ 1లో మొత్తం 11 అంశాలను పేర్కొన్నారు. వీటిలో ఇంచుమించు అన్ని అంశాలు గ్రూప్-1 ప్రిలిమ్స్ సిలబస్‌లో ఉన్నవే.
  • గ్రూప్-1 ప్రిలిమ్స్ సిలబస్‌లోని భారత ఆర్థిక, సామాజిక అభివృద్ధి; భారత రాజ్యాంగం, రాజనీతిశాస్త్రం అంశాలు గ్రూప్-2 పేపర్-1లో లేవు.
  • గ్రూప్-2లో పదో తరగతి స్థాయిలో బేసిక్ ఇంగ్లిష్‌ను సిలబస్‌లో చేర్చారు.
  • సబ్జెక్టులోని వివిధ అంశాలను, సమకాలీన అంశాలతో సమన్వయపరుస్తూ చదివితే మంచి ఫలితం ఉంటుంది.
  • వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి విశ్వం, సౌర కుటుంబం, గ్రహాలు, ఉపగ్రహాల గురించి తెలుసుకోవాలి. భూమికి సంబంధించి భూభ్రమణం, భూపరిభ్రమణం.. వాటి ప్రభావాలను గురించి చదవాలి. భూమి అంతర్నిర్మాణం-పొరలు గురించి తెలుసుకోవాలి.
  • పీఠభూములు, మైదానాలు వంటి ప్రధాన భూ స్వరూపాలు; అంతర్జాతీయ దినరేఖ, స్థానిక కాలం తదితరాల గురించి తెలుసుకోవాలి.
  • ప్రధాన పంటలు-పండించే దేశాలు; వ్యవసాయ రీతులు, వ్యవసాయ ఉత్పత్తులు; అటవీ విస్తరణ, అటవీ సమస్యలు, అంతరించిపోతున్న జీవజాతులు, రెడ్ డేటా బుక్‌ల గురించి తెలుసుకోవాలి.
  • ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి మన దేశానికి సంబంధించి వార్తల్లో ఉన్న భౌగోళిక ప్రాంతాల ఉనికి, సహజ ఉద్భిజ సంపదపై దృష్టిసారించాలి.
  • తెలంగాణ ఆర్థిక సర్వేలోని ముఖ్యమైన అంశాలను తప్పకుండా చదవాలి. వీటి నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.
  • పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి.

విపత్తు నిర్వహణ (డిజాస్టర్ మేనేజ్‌మెంట్)

  • విపత్తులు- వాటి నిర్వహణ, విపత్తుల రకాలు, ప్రభావాలు, కారణాల గురించి చదవాలి.
  • భూకంపాలు, వరదలు, కరువులు, సునామీలను భారతదేశం కోణంలో అధ్యయనం చేయాలి.
  • దేశంలో విపత్తు నిర్వహణ-పరిణామాల గురించి తెలుసుకోవాలి. పారిశ్రామిక, రసాయన విపత్తులపైనా దృష్టిసారించాలి.
  • జనరల్ సైన్స్/ఎస్ అండ్ టీకి సంబంధించి జనరల్ సైన్స్‌లో భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, జీవశాస్త్రం తదితర విభాగాలుంటాయి. వీటికి అదనంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ కాలుష్యం, జీవ వైవిధ్యం వంటి అంశాలపై కూడా దృష్టిసారించాలి.
  • విటమిన్లు, రక్త వర్గాలు, వివిధ వ్యాధులు- కారకాలు, మానవ శరీరం, హార్మోన్లు, గ్రంథులు తదితర అంశాలను చదవాలి. ముఖ్యంగా గుర్తించుకోవాల్సింది…నిత్యజీవితంలో సైన్స్ కోణంలో ప్రిపరేషన్ కొనసాగించాలి.
  • టెక్నాలజీ రంగంలో అంతరిక్ష రంగం- ఇటీవలి ప్రయోగాల వివరాలు; రక్షణ రంగం- ప్రధానంగా క్షిపణుల సమాచారం; అణుశక్తి- విచ్ఛిత్తి, సంలీనం, రేడియోధార్మిక ఐసోటోపుల ఉపయోగాలు, రియాక్టర్ల రకాలు; ఐటీ- సోషల్ నెట్‌వర్కింగ్, ఈ-గవర్నెన్స్; బయోటెక్నాలజీ- మూలకణాలు, జన్యుమార్పిడి మొక్కలు, టీకాలు తదితర అంశాలను చదవాలి.
  • భౌతికశాస్త్రంలో మెకానిక్స్, ప్రమాణాలు, విద్యుత్, ధ్వని, ఉష్ణశక్తి మొదలైనవి. రసాయనశాస్త్రంలో అనువర్తిత అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

గ్రూప్- 2: పేపర్-2

భారత, తెలంగాణ సాంఘిక సాంస్కృతిక చరిత్ర.

  • సింధు నాగరికత కాలం నాటి సామాజిక, సాంస్కృతిక అంశాలను సిలబస్‌లో ప్రస్తావించారు. తొలి వేద, మలివేద నాగరికతలు; క్రీ.పూ.ఆరో శతాబ్దంలోని మత ఉద్యమాలు; మౌర్యులు, గుప్తులు, పల్లవులు, చాళుక్యులు, చోళులు సాంఘికంగా, సాంస్కృతికంగా చేసిన సేవలను అధ్యయనం చేయాలి.
  • ఢిల్లీ సుల్తానులు; సూఫీ, భక్తి ఉద్యమాలు; మొఘలుల కాలంనాటి సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు, భాష, సాహిత్యం, కళలు, నిర్మాణాలపై అవగాహన అవసరం.
  • బ్రిటిష్ సామ్రాజ్య ఆవిర్భావం, విస్తరణ అంశాలను సిలబస్‌లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి కార్నవాలీస్, వెల్లస్లీ, విలియం బెంటింక్, డల్హౌసీ తదితరుల కాలం నాటి సాంఘిక, సాంస్కృతిక విధానాలు; 19వ శతాబ్దం నాటి సాంఘిక- మత సంస్కరణ ఉద్యమాలు, భారత్- సాంఘిక నిరసన ఉద్యమ అంశాలను సిలబస్‌లో ప్రస్తావించారు.
  • ప్రాచీన తెలంగాణ చరిత్రకు సంబంధించి శాతవాహనులు; ఇక్ష్వాకులు; విష్ణుకుండినులు; ముదిగొండ, వేములవాడ చాళుక్యులు.. వారి కాలంలో మత, భాషా, సాహ్యితం, కళలు, నిర్మాణాలకు సంబంధించిన అంశాలున్నాయి. – మధ్యయుగ తెలంగాణ చరిత్రకు సంబంధించి కాకతీయులు, రాచకొండ-దేవరకొండ వెలమలు, కుతుబ్‌షాహీల పరిపాలనకాలం నాటి అంశాలను సిలబస్‌లో పేర్కొన్నారు. వీటితో పాటు సాంఘిక, సాంస్కృతిక పరిణామాలకు సంబంధించి ఉత్సవాలు, జాతరలు, ఉర్సు, మొహర్రం తదితర అంశాలను పేర్కొన్నారు.
  • అసఫ్‌జాహీ వంశానికి సంబంధించి నిజాం ఉల్ ముల్క్ మొదలు మీర్ ఉస్మాన్ అలీఖాన్ వరకు చదవాలి. సాలార్‌జంగ్ సంస్కరణలు, సామాజిక వ్యవస్థ, సామాజిక పరిస్థితులు. జాగీర్దారులు, జమీందారులు, దేశ్‌ముఖ్‌లు, దొరలు, వెట్టి-భాగెల వ్యవస్థ, మహిళల స్థితిగతులు. తెలంగాణలో సాంఘిక-సాంస్కృతిక ఉద్యమాలకు సంబంధించి ఆర్యసమాజం, ఆంధ్రమహాసభ, ఆంధ్ర మహిళా సభ, ఆది-హిందూ ఉద్యమాలు. గిరిజన, రైతుల తిరుగుబాట్లకు సంబంధించి రాంజీ గోండు, కొమరం భీం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం; పోలీసు చర్య, నిజాం పరిపాలన ముగింపు అంశాలు సిలబస్‌లో ఉన్నాయి.

సామాజిక, సాంస్కృతిక అంశాలు ప్రధానం:

  • మొత్తంమీద సిలబస్‌లోని భారత, తెలంగాణ చారిత్రక అంశాలను పరిశీలిస్తే రాజకీయ చారిత్రక అంశాల కంటే సామాజిక, సాంస్కృతిక చరిత్రకు ప్రాధాన్యమిచ్చినట్లు అర్థమవుతోంది. అంటే ఆయా రాజవంశీయుల కాలాల్లో రాజులు-యుద్ధాలు-సంధులు వంటి వాటిపై కాకుండా రాజుల కాలంలోని నిర్మాణాలు, కళలు, సామాజిక పరిస్థితులు, మత పరిస్థితులు తదితర అంశాలపై ప్రధానంగా దృష్టిసారించాలి.
  • ఉదాహరణకు శాతవాహనుల గురించి చదివేటప్పుడు వారిలో గొప్ప రాజులు, వారు చేసిన యుద్ధాలు, బిరుదులు వంటివి కాకుండా పల్లవుల సాంస్కృతిక సేవ; సామాజిక సేవ; వారి కాలంలోని గొప్ప నిర్మాణాలు, ఆచార వ్యవహారాలు తదితర అంశాలను అధ్యయనం చేయాలి. ఈ విషయంలో సిలబస్‌లో స్పష్టత ఉంది.

భారత రాజ్యాంగం, రాజకీయాలు అవలోకనం

  • భారత రాజ్యాంగ పరిణామ క్రమం: స్వభావం, ముఖ్యాంశాలు- పీఠిక.
  • ప్రాథమిక హక్కులు-ఆదేశిక సూత్రాలు-ప్రాథమిక విధులు.
  • భారత సమాఖ్య- విలక్షణ లక్షణాలు: కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసన, పరిపాలన అధికారాల పంపిణీ.
  • గ్రామీణ, పట్టణ పరిపాలన (73, 74వ రాజ్యాంగ సవరణలకు ప్రాధాన్యం)
  • ఎన్నికల వ్యవస్థ: ఎన్నికలు, అక్రమాలు, ఎన్నికల కమిషన్, ఎన్నికల సంస్కరణలు, రాజకీయ పార్టీలు.
  • భారత న్యాయ వ్యవస్థ – న్యాయ వ్యవస్థ క్రియాశీలత.
  • షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు, వెనుకబడిన తరగతులు, మహిళలు, మైనార్టీలు-ప్రత్యేక సదుపాయాలు.
  • జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్టీ కమిషన్, వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్.
  • భారత రాజ్యాంగం: కొత్త సవాళ్లు

సాంఘిక నిర్మాణం, అంశాలు, ప్రభుత్వ విధానాలు

  • భారత సాంఘిక నిర్మాణం: భారతీయ సమాజం- ప్రధాన లక్షణాలు- కులం, కుటుంబం, వివాహం, బంధుత్వం, మతం, తెగ, మహిళలు; తెలంగాణ సమాజంలో సామాజిక, సాంస్కృతిక లక్షణాలు.
  • సామాజిక సమస్యలు: కులతత్వం, మతతత్వం, ప్రాంతీయ తత్వం, మహిళలపై హింస, బాల కార్మికులు, మనుషుల అక్రమ రవాణా తదితర అంశాలు.
  • సాంఘిక ఉద్యమాలు: రైతు ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు, వెనుకబడిన తరగతుల ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, పర్యావరణ ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు, ప్రాంతీయ స్వయంప్రతిపత్తి ఉద్యమాలు, మానవ హక్కుల ఉద్యమాలు.
  • తెలంగాణ సాంఘిక సమస్యలు: వెట్టి,జోగిని, దేవదాసీ వ్యవస్థ, బాల కార్మికులు, బాలికల సమస్యలు, ఫ్లోరోసిస్, వలసలు, రైతులు-చేనేత కార్మికుల సమస్యలు.
  • సామాజిక విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, కార్మికులు, వికలాంగులు, చిన్నారులకు సంబంధించి నిశ్చయాత్మక విధానాలు- సంక్షేమ కార్యక్రమాలు; ఉపాధి, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు; గ్రామీణ, పట్టణ, మహిళలు, చిన్నారులు, గిరిజనులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు.
  • ప్రభుత్వ అధికారిగా నియమితులయ్యే వారికి తన చుట్టూ ఉన్న సమాజం స్థితిగతులపై స్పష్టమైన అవగాహన ఉండాలన్న లక్ష్యంతో సిలబస్‌ను రూపొందించారు.
  • ఒక పేపర్‌లోని అంశాలకు, మరో పేపర్‌లోని అంశాలకు అంతర్గతంగా సంబంధముంది. దీన్ని అర్థం చేసుకొని ఔత్సాహికులు ప్రిపరేషన్ కొనసాగించాలి. – మామూలుగా చూస్తే సిలబస్ ఎక్కువగా ఉందనిపిస్తుంది. అయితే ఆ సిలబస్‌కు సంబంధించి సూక్ష్మ అంశాలను స్పష్టంగా పేర్కొన్నారు కాబట్టి పరీక్షలకు సిద్ధమవటం తేలికే.
  • ఏమి చదవాలి? ఏమి చదవకూడదు? అనే ప్రశ్నలు అభ్యర్థిలో తలెత్తకుండా సిలబస్‌ను స్పష్టంగా ఇచ్చారు.
  • రాజ్యాంగానికి సంబంధించి పాత అంశాలే ఉన్నాయి. రాజ్యాంగ నిర్మాణం, ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాలు తదితర అంశాలు ఎప్పటి తరహాలోనే సిద్ధమైతే సరిపోతుంది.
  • రాజ్యాంగ పరిషత్ ఎన్నికల విధానం; ముఖ్య కమిటీల అధ్యక్షులు; పరిషత్ చివరి సమావేశం లక్ష్యాల తీర్మానం (పీఠికకు మూలం); ముఖ్య షెడ్యూళ్లు, కీలకమైన సుప్రీంకోర్టు తీర్పులు; రాష్ట్రపతి ఎన్నిక; రాజ్యసభ/విధాన పరిషత్‌లకు ఎన్నిక విధానం; కేంద్ర-రాష్ట్ర సంబంధాలు; జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల ఏర్పాటు, కాశ్మీర్ రాష్ట్ర ప్రత్యేక ప్రతిపత్తి; ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలకు సంబంధించిన జాతీయ కమిషన్ల తాజా సమాచారాన్ని చదవాలి.
  • సమాజంలోని వివిధ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వాలు చేపడుతున్న పథకాల గురించి తెలుసుకోవాలి. సమాజ వికాసం, గ్రామీణ వికాసానికి (ఉదాహరణకు గ్రామజ్యోతి..) సంబంధించిన కార్యక్రమాలపై అవగాహన పెంపొందించుకోవాలి. – తెలంగాణలో జిల్లాల వారీగా ఉన్న సమస్యలను తెలుసుకొని, వాటికి గల కారణాలు- పరిష్కారానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి అవగాహన పెంపొందించుకోవాలి. ఉదాహరణకు కరీంనగర్, నిజామాబాద్ నుంచి గల్ఫ్‌కు వలసలు ఎక్కువగా ఉంటాయి. దీనికి కారణాలు తెలుసుకోవాలి.

గ్రూప్-2: పేపర్-3

ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్
ఎకానమీ సిలబస్‌ను గతంలో మాదిరిగానే మూడు సెక్షన్లుగా విభజించారు. ప్రతి సెక్షన్‌లో నాలుగు యూనిట్లు ఉన్నాయి. ఒక్కో సెక్షన్ నుంచి 50 మార్కులకు ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.సెక్షన్-1: భారత ఆర్థిక వ్యవస్థ-సమస్యలు, సవాళ్లు
  1. ఆర్థికవృద్ధి, ఆర్థికాభివృద్ధి- భావనలు,
    వృద్ధి- అభివృద్ధి మధ్య సంబంధాలు.
  2. ఆర్థికవృద్ధి కొలమానాలు- జాతీయాదాయం
    నిర్వచనాలు- భావనలు, జాతీయాదాయం.
  3. పేదరికం-నిరుద్యోగిత: ఆదాయ సంబంధిత
    పేదరికం, ఆదాయేతర సంబంధిత పేదరికం.
  4. భారతదేశ పంచవర్ష ప్రణాళికలు- లక్ష్యాలు, వ్యూహాలు, సాధించిన ప్రగతి. 12వ పంచవర్ష

ప్రణాళిక-సమ్మిళిత వృద్ధి, నీతి ఆయోగ్:

  • ఒకటో సెక్షన్‌లో మొత్తం భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలను పొందుపరిచారు. దీంట్లో జాతీయ ఆదాయ నిర్వచనాలు, భావనలు కీలకమైన అంశాలు. జాతీయ ఉత్పత్తి, దేశీయ ఉత్పత్తి భావనలు, స్థూల ఉత్పత్తి, నికర ఉత్పత్తి భావనలను సమీకరణాలతో సహా అవగాహన చేసుకోవాలి.
  • జాతీయ ఆదాయంతో పాటు వృద్ధి- అభివృద్ధి భావనలను కూడా అధ్యయనం చేయాలి. వీటి మధ్యగల సంబంధాలు, కొలమానాలను విశ్లేషించాలి.
  • వృద్ధి, అభివృద్ధి కొలమానాలు అనగా… GNP, GDP, తలసరి ఆదాయం, తలసరి వినియోగం, నికర ఆర్థిక సంక్షేమ సూచి, Physical Quality of Life Index (PQLI), Human Development Index (HDI) తదితర సూచికలను అధ్యయనం చేయాలి.
  • భారతదేశ ప్రణాళికలు, లక్ష్యాలు, వ్యూహాలు, ఆ ప్రణాళికలలో సాధించిన విజయాలను అధ్యయనం చేయాలి. ముఖ్యంగా 12వ పంచవర్ష ప్రణాళికలో నిర్ణయించిన లక్ష్యాలు, ఆ లక్ష్యాల ద్వారా సమ్మిళితవృద్ధి ఎలా సాధించవచ్చు? సమ్మిళితవృద్ధి అంటే ఏమిటి? సమ్మిళిత వృద్ధి ద్వారా ఆర్థికవృద్ధి ఎలా సాధించవచ్చు అనే కోణంలో విశ్లేషించుకోవాలి. 2015, జనవరి 1న ప్రారంభించిన ‘నీతి ఆయోగ్’ నిర్మాణం-లక్ష్యాలు, విధులు మొదలైన అంశాలను చదవాలి.
  • వివిధ పంచవర్ష ప్రణాళికల కాలాల్లో ప్రారంభించిన పథకాలు, వాటి లక్ష్యాలను కూడా అధ్యయనం చేయాలి. ప్రణాళికల్లోని సంక్షేమ పథకాలు, పేదరిక, నిరుద్యోగ నిర్మూలన పథకాల గురించి చదవాలి.
  • పేదరికం, నిరుద్యోగం అనగానేమి? వాటి భావనలు ఏమిటి? పేదరికం, నిరుద్యోగితలకు కారణాలు, నివారణ చర్యలు. పేదరికం, నిరుద్యోగితలను తగ్గించేందుకు ప్రారంభించిన పథకాలు. వీటిలో స్వయం ఉపాధి పథకాలు, వేతన ఉపాధి పథకాల గురించి అధ్యయనం చేయాలి.

సెక్షన్ 2: ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ తెలంగాణ:

  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ ఎకానమీ, వెనుకబాటు, జల, ఆర్థిక, ఉపాధి తదితర అంశాలపై ఏర్పాటు చేసిన కమిటీలు, సూచనలు.
  • తెలంగాణ -భూసంస్కరణలు, ల్యాండ్ సీలింగ్, షెడ్యూల్డ్ ఏరియాల్లో భూపరిమితులు తదితర అంశాలను చదవాలి.
  • వ్యవసాయం అనుబంధ రంగాలు, పారిశ్రామిక, సేవారంగాలతో పాటు తెలంగాణ పారిశ్రామిక విధానం గురించి అధ్యయనం చేయాలి.

సెక్షన్ 3: అభివృద్ధి, మార్పు -సమస్యలు

  • ప్రాంతీయ అసమానతలు, భూసేకరణ విధానం, ఆర్థిక సంస్కరణలు, సుస్థిర అభివృద్ధి తదితర అంశాలపై దృష్టి సారించాలి.

గ్రూప్-1: పేపర్ 6 /గ్రూప్-2: పేపర్ 4

తెలంగాణ ఉద్యమం.. రాష్ట్ర ఆవిర్భావం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన గ్రూప్-1, గ్రూప్-2 పరీక్ష సిలబస్‌లో అభ్యర్థులు ఒకింత ఆందోళనకు గురవుతున్న పేపర్.. ‘తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర ఆవిర్భావం’. గ్రూప్-1 మెయిన్స్‌లో ఆరో పేపర్‌గా, గ్రూప్-2లో నాలుగో పేపర్‌గా పేర్కొన్న ఈ పేపర్ కోసం ఎలా చదవాలి? ఏఏ అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలి? అనే విషయమే చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర ఆవిర్భావం పేరుతో ప్రకటించిన పేపర్‌ను మూడు విభాగాలుగా వర్గీకరించారు. అవి.. ఐడియా ఆఫ్ తెలంగాణ (1948-70); సమీకరణ దశ (1971-90); తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశ (1991-2014). వాస్తవానికి గ్రూప్-1 మెయిన్స్, గ్రూప్-2 రెండో పేపర్‌లలో పేర్కొన్న తెలంగాణ సామాజిక-సాంస్కృతిక చరిత్ర, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనే విభాగాలను సిలబస్ అంశాల్లో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం.. రాష్ట్ర ఆవిర్భావం పేపర్‌లో రాణించేందుకు తెలుసుకోవాల్సిన అంశాలు.. మంచి మార్కుల కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై నిపుణుల విశ్లేషణ..

ఐడియా ఆఫ్ తెలంగాణ (1948-70)
హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ ప్రత్యేక సంస్కృతి, తెలంగాణ భౌగోళిక, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ దృక్కోణం; తెలంగాణ ప్రజలు, కులాలు, మతాలు, కళలు, పండగలు, హైదరాబాద్ సంస్థానంలో పరిపాలన, సాలార్‌జంగ్ సంస్కరణలు, ముల్కీ, నాన్ ముల్కీ తదితరాల గురించి తెలుసుకోవాలి. ఐడియా ఆఫ్ తెలంగాణ విభాగానికి సంబంధించి అభ్యర్థులు 1948లో హైదరాబాద్‌పై పోలీస్ చర్యతో తమ ప్రిపరేషన్‌ను ప్రారంభించాలి. ఈ క్రమంలో 1948 సెప్టెంబరు 13 నుంచి 17వ తేదీ వరకు జరిగిన ముఖ్య పరిణామాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ పోలీసు చర్యలో కీలక వ్యక్తులుగా గుర్తింపు పొందిన అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ ప్రతినిధి కె.ఎం.మున్షి, అప్పటి హైదరాబాద్ ప్రధాని మీర్ లాయక్ అలీ తదితర వ్యక్తుల గురించి అవగాహన కూడా ఎంతో ముఖ్యం. వీటితోపాటు ఆ సమయంలో వివిధ పత్రికలు, ప్రసార మాధ్యమాలు పాత్రలపై అవగాహన కూడా అవసరం.

  • బూర్గుల రామకృష్ణారావు మంత్రి వర్గం; 1952 ముల్కీ ఆందోళన; స్థానికులకు ఉద్యోగాల కోసం డిమాండ్; సిటీ కాలేజీ ఘటన, దాని ప్రాముఖ్యత; 1953లో తెలంగాణ రాష్ట్రం కోసం డిమాండ్, చర్చ, 1953లో ఫజల్ అలీ కమిషన్, సిఫార్సులు తదితర అంశాలపై లోతైన అవగాహన పొందాలి. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు; 1956లో ఫిబ్రవరి 20న జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం – అందులోని ముఖ్యాంశాలు తెలుసుకోవాలి. ఈ ఒప్పందంలో చేసుకున్న తీర్మానాలు – వాటికి కలిగిన విఘాతం వంటి కారణాలు ఇతర ముఖ్యాంశాలు. ఇదే క్రమంలో 1969లో జై తెలంగాణ ఉద్యమానికి దారి తీసిన సంఘటనలపై దృష్టి పెట్టాలి. ఈ దశలో ముఖ్యమైన ఘటనలుగా ఉన్న అష్ట సూత్రాలు, అయిదు సూత్రాలు – వాటి ప్రభావాలు, కోస్తాంధ్ర ప్రాంతం నుంచి వలసలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి.
  • 1970 తర్వాత వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్, విద్య, ఉద్యోగాలు, వైద్యం, ఆరోగ్య రంగాల్లో తెలంగాణ పరిస్థితి. ఉద్యోగాలు, సర్వీస్ రూల్స్ ఉల్లంఘన, తెలంగాణ పోరాటం ప్రారంభం, నిరసనలు, ప్రత్యేకం తెలంగాణ కోసం 1969 పోరాటం; తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటు; జీవో 36, అష్ట సూత్ర, పంచ సూత్ర పథకాలు, వాటి ప్రభావం గురించి విపులంగా తెలుసుకోవాలి.

రెండో దశ.. సమీకరణ (1971-90)
తెలంగాణ ఉద్యమం- రాష్ట్ర ఆవిర్భావం పేపర్‌లో పేర్కొన్న రెండో దశ మొబిలైజేషన్ (సమీకరణ దశ) కోసం అభ్యర్థులు కొంత ఎక్కువ కసరత్తు చేయాలి. కారణం ఈ దశలో ఎన్నో ముఖ్య ఘట్టాలు, పరిణామాలు జరిగాయి. ఈ నేపథ్యంలో 1972లో జై ఆంధ్ర ఉద్యమం; 1973లో రాష్ర్టపతి పాలన, ఆరు సూత్రాల పథకం; తెలంగాణకు వ్యతిరేకంగా జరిగిన చర్యలు; రాష్ట్రపతి ఉత్తర్వులు, జోనల్ వ్యవస్థ ఏర్పాటు వంటివి చదవాలి. జై ఆంధ్ర ఉద్యమం ప్రారంభమైన మరుసటి సంవత్సరమే 1973 రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. ఈ సమయంలో ముఖ్యమైన ఘట్టాలు తెలుసుకోవాలి. ఆర్టికల్ 371డి, రాష్ట్రపతి ఉత్తర్వులు, జీవో 610, ఉల్లంఘనలు తదితర అంశాలపై అవగాహన పొందాలి. న క్సలైట్ ఉద్యమం, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, రైతు కూలీ సంఘాలు, గిరిజన భూముల ఆక్రమణ, ఆదివాసీల తిరుగుబాటు, జల్, జంగల్, జమీన్ నేపథ్యం తెలుసుకోవడం పరీక్షల కోణంలో చాలా అవసరం. 1980ల్లో ప్రాంతీయ పార్టీలు, తెలంగాణలో రాజకీయ, సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక మార్పులు, తెలంగాణ అస్తిత్వ అణచివేత; తెలంగాణ ఆత్మాభిమానం, భాషాసంస్కృతులపై దాడి తదితర అంశాలను అధ్యయనం చేయాలి. 1990ల్లో ఆర్థిక సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలు, వాటి ప్రభావం; పెరిగిన ప్రాంతీయ అసమానతలు; తెలంగాణలో వ్యవసాయం, చేతివృత్తుల రంగాల్లో సంక్షోభం, తెలంగాణ సమాజం, ఆర్థిక వ్యవస్థ వాటి ప్రభావం గురించి అవగాహన పొందాలి. దాంతోపాటు తెలంగాణ అస్తిత్వం కోసం జరిగిన చర్చలపైనా దృష్టిపెట్టాలి.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం.. మూడో దశ
తెలంగాణ ఉదమ్యం- రాష్ట్ర ఆవిర్భావంలో ముఖ్యమైన దశ మూడో దశ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం (1990-2014) దశ. గ్రూప్స్ అభ్యర్థులు దీనికి సంబంధించి లోతైన అవగాహన పొందాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ దశలో ఏర్పాటైన ముఖ్యమైన పార్టీలు / సంస్థల గురించి సమాచారం, వాటి నేపథ్యాలు తెలుసుకోవాలి. తెలంగాణలో ప్రజాచైతన్యం, పౌరసంఘాల ఆవిర్భావం, ప్రత్యేక తెలంగాణ అస్థిత్వ భావన, తెలంగాణ ఐక్యవేదిక, భువనగిరి సభ, తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ, వరంగల్ ప్రకటన, తెలంగాణ విద్యార్థుల వేదిక వంటి అంశాలపై ముఖ్యంగా దృష్టిసారించాలి. ముఖ్యంగా 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుకు దారి తీసిన పరిస్థితుల గురించి అధ్యయనం చేయాలి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుకు కారణమైన పలు రాజకీయ పార్టీల తెలంగాణ వ్యతిరేక విధానాల గురించి తెలుసుకోవాలి. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన పలు కార్యక్రమాలు, సభలు, సమావేశాలు మొదలు 2009 నవంబర్ 29న టీఆర్‌ఎస్ వ్యవస్థాపకులు కె. చంద్రశేఖర్ రావు ఆమరణ నిరాహారదీక్షకు దారి తీసిన పరిస్థితులు, డిసెంబర్ 9న అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ప్రకటన వరకు అన్నీ ముఖ్యమే అని గుర్తించాలి. తెరాస, కాంగ్రెస్, భాజపా, వామపక్షాలు, తెదేపా, ఎంఐఎంవంటి పార్టీల పాత్రపైనా అవగాహన పెంపొందించుకోవాలి. తెలంగాణలో సాంస్కృతిక పునరుజ్జీవనం, సాహిత్యం, కళలు, కవులు, రచయితలు, గాయకులు, మేధావులు, ఉద్యోగులు, కళాకారులు, విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, మహిళల పాత్ర గురించి తెలుసుకోవాలి.

  • జేఏసీ కార్యకలాపాలపై ప్రత్యేక శ్రద్ధ.. సమీకరణ దశలో ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షతో ముందుకు కదిలిన పార్టీలు / ఫోరంలతోపాటు మరింత కీలకంగా వ్యవహరించింది జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ). ఈ నేపథ్యంలో అభ్యర్థులు పొలిటికల్ జేఏసీ, తెలంగాణలో శాఖల వారీగా ఏర్పాటైన జేఏసీలు వాటి కార్యకలాపాలు, నిరసన కార్యక్రమాల గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా మిలియన్ మార్చ్; సడక్ బంద్; సకల జనుల సమ్మె; పల్లె పల్లె పట్టాలపైకి వంటి ఉద్యమ కార్యక్రమాలు ఆ సందర్భంలో జరిగిన పర్యవసానాల గురించి తెలుసుకోవాలి.
  • గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిటీల గురించి క్రమానుగతంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా లలిత్ కుమార్ కమిటీ (1969); భార్గవ, వాంఛూ కమిటీ (1969); భరత్‌రెడ్డి కమిటీ (1985); 610 జీవో (1985); గిర్‌గ్లానీ కమిషన్ (2001); ప్రణబ్ ముఖర్జీ కమిటీ (2005); శ్రీ కృష్ణ కమిటీ (2010) వాటి సిఫార్సులపై అధ్యయనం చేయాలి. వీటితోపాటు శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులపై 2011, మార్చి 23న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి పేర్కొన్న అంశాలు చదవాలి.

తెలంగాణ ఆవిర్భావం దిశగా
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి శ్రీ కృష్ణ కమిటీ సిఫార్సుల తర్వాత క్రమంలో తెలంగాణ ఏర్పాటు దిశగా జరిగిన పరిణామాలపై అవగాహన కూడా ఎంతో ముఖ్యం. ఈ క్రమంలో 2013, జూలై 1న తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందంటూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటన; ఆగస్ట్ 6 విభజన కమిటీ ఏర్పాటు; ఏకే ఆంటోనీ నేతృత్వంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు ముఖ్యాంశాలుగా గుర్తించాలి. వీటికి కొనసాగింపుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టడం, తర్వాత లోక్‌సభ ఆమోదం; గెజిట్ విడుదల, ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు ఇవ్వడం (మార్చి 4, 2014) ఒక క్రమశ్రేణిలో చదవాలి. తర్వాత 2014లో ఎన్నికలు జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా ప్రకటన వంటి అంశాలు కూడా ముఖ్యమే.

పేపర్-2తో అనుసంధానం చేసుకుంటూ
తెలంగాణ ఉద్యమం- రాష్ట్ర ఆవిర్భావం పేపర్‌ను గ్రూప్-1 మెయిన్స్‌లో, గ్రూప్-2లో రెండో పేపర్‌గా పేర్కొన్న తెలంగాణ సామాజిక-సాంస్కృతిక చరిత్ర, తెలంగాణ ఆవిర్భావంతో అనుసంధానం చేసుకుంటే కొంత సమయం కలిసొస్తుంది. సామాజిక, సాంసృతిక చరిత్రకు సంబంధించి కవులు, కళాకారులు వంటి విషయాలపై అవగాహన లభిస్తుంది. తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించి నిజాం కాలం నాటి పరిస్థితులపై సమాచారం పొందొచ్చు.

డిస్క్రిప్టివ్ అప్రోచ్‌తో
కొత్తగా పేర్కొన్న పేపర్ గ్రూప్-1, గ్రూప్-2 రెండింటిలోనూ ఉంది. ఇది ఈ రెండు పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు సమయం పరంగా కలిసొచ్చే అంశంగా మలచుకోవాలి. గ్రూప్-1 మెయిన్స్ కోణంలో డిస్క్రిప్టివ్ విధానంలో చదువుతూ ముఖ్యాంశాలతో బిట్స్ / షార్ట్ నోట్స్ రూపొందించుకుంటే గ్రూప్-2కు కూడా ఉపకరిస్తుంది.

 

 

Faqs on TSPSC Group 2 Telugu Syllabus

 

How do I know syllabus & exam pattern of TSPSC Group 2 Telugu exam?

You can view in our syllabus section or download the TSPSC Group 2 Telugu Notification from below and view the selection criteria. Note download for latest 2023 vacancy Group 2 Telugu. Mostly, every government competitive exam, including Telangana Public Service Commission Group 2 Telugu recruitment contains general aptitude & general awareness test. Detailed syllabus topics available within pdf 2023 notification, or follow our TSPSC Group 2 Telugu syllabus page for indicative syllabus & exam pattern.

What’s the selection Process for TSPSC Group 2 Telugu exam?

It’s officially mentioned in the TSPSC recruitment 2023 notification that selection process of Group 2 Telugu exam shortlist based on written exam.  Some posts in same Telangana Public Service Commission Recruitment Advertisement or notification require physical, oral tests along with medical tests. Candidates are advised to go through the TSPSC Group 2 Telugu pdf notification 2023 carefully after getting preliminary info here.